Free Porn
xbporn
london escorts buy instagram followers buy tiktok followers
Tuesday, July 23, 2024
Google search engine
HomeUncategorizedరక్షాబంధన్ 2022

రక్షాబంధన్ 2022

రక్షాబంధన్.. సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ. అన్నకు చెల్లి, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. రక్షాబంధన్ రాఖీ పండుగ అని, రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. అన్నా చెల్లెళ్ళు , అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ. ఈ పండుగ ఈ సంవత్సరం ఆగస్ట్ 11న 2022, వస్తుంది.

ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశాలలోని మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడు అత్యున్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎప్పుడూ అన్నకు అండగా చెల్లెలు ఉంటుందని చెప్తుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లెలికి తోడుగా ఉంటానని ఈ రాఖీ పండుగ ద్వారా తెలియజేస్తారు.

rakhi pournami 2022 Cinepakoda
Rakhi Pournami 2022 ()

ఈ విశిష్టమైన రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారు. రాఖీ పండుగను జరుపుకునే ఆచారం ఎలా మొదలైంది ? ఆ చరిత్ర ఏంటి ? అనేది తెలుసుకుందాం.

పూర్వం దేవతలకు మరియు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలంపాటు యుద్ధం సాగింది. ఈ యుద్ధంలో ఓడిపోయిన దేవతలకు రాజు దేవేంద్రుడు, తన పరివారం అంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడని , భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు పంపుతుంది. అయితే అదే రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడు చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి ఈ యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి త్రిలోకాధిపత్యాన్ని సంపాదించగలుగుతాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం. అప్పటినుండి ఇప్పటివరకు రాఖీ పండుగను ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగగా మారింది.

ఇక నాటి నుండి ఈ పండుగ ఆచారంగా కొనసాగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథ మాత్రమే కాదు రక్షాబంధనం గురించి ఇంకా బోలెడన్ని పురాణలు కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన్నప్పుడు కృష్ణుడు చూపుడువేలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపతి తన పట్టు చీర కొంగు చూపి కృష్ణుడి చేతికి కట్టు కట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపతికి భరోసా ఇచ్చాడు అందుకు ప్రతిగా దుశ్శాసనుడు దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కాపాడారని పురాణాలు చెబుతున్నాయి.

అంతే కాదు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళలోకానికి వెళ్లి ఉండిపోగా, విష్ణు తీసుకువెళ్లడానికి వచ్చిన లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్షాబంధనాన్ని కట్టిన తనకు రక్షణ కల్పించమని లక్ష్మీదేవి బలిచక్రవర్తిని కోరుతుంది. బలి చక్రవర్తి సోదరుడిగా తనకు రక్షాబంధన్ కట్టిన సోదరికి బహుమానంగా విష్ణుమూర్తిని పంపుతాడు. దీంతో లక్ష్మీదేవి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది. ఇంతటి శక్తివంతమైనడి కాబట్టి రక్షాబంధనానికి అంతటి చరిత్ర ఉంది. ఈనాటికీ ప్రతి ఒక్కరు రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండుగను సోదరులు సోదరీమణులు తమ మధ్య ఉన్న ప్రేమను ఈ రక్షాబంధన్ కట్టి వారి యొక్క ప్రేమను ఈ విధంగా జరుపుకుంటారు.

నేటి సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న ఈ రోజుల్లో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదర సోదరీమణుల మధ్య ఉండే అనుబంధానికి, ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండుగ రాఖీ కావడంతో మానవ సంబంధాల మెరుగుదలకు, విచక్షణకు ఈ పండుగ ఎంతో దోహదం చేస్తుంది. రాఖీ పండుగను రక్తం పంచుకుని పుట్టిన సోదర సోదరీమణుల మధ్య జరుపుకోవాలని లేదు ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు, సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధన్ కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు. ఆత్మీయుల మధ్య అనుబంధాలకు మరియు పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తుంది. రాఖీ పండుగ రోజు ఉదయాన్నే తలకు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని, రాఖీ కట్టడానికి సిద్ధమవుతారు అక్క చెల్లెల్లు . సోదరులు కూడా తమ ప్రియమైన సోదరీమణులు కట్టే రాఖీలను స్వీకరించి వారిని సంతోష పెట్టేలా వారికి బహుమానం ఇవ్వడానికి రెడీ అవుతారు. తరువాత హారతి ఇచ్చి, బొట్టు నుదుటన పెట్టి స్వీట్ తినిపిస్తారు. చెల్లెలు అన్న ఆశీర్వాదాన్ని, అక్క అయితే తమ్ముళ్లకు ఆశీస్సులను అందిస్తారు. నిండు నూరేళ్లు సుఖంగా జీవించమని దీవిస్తారు. నీకు నేను ఎప్పుడూ నీకు రక్షగా నాకు నువ్వు రక్షణగా ఉండాలని ధర్మాన్ని రక్షాబంధన్ తో తెలియజేస్తారు. ఇక రక్షా బంధనం రోజు అన్నదమ్ములు ఇచ్చే బహుమతులు అంటే సోదరీ మణులకు ఎనలేని మక్కువ. వారికి ఇచ్చే బహుమతి ఏదైనా ఎంతో ప్రేమగా దాచుకుంటారు. తీపి జ్ఞాపకంగా భావిస్తారు. ఇప్పటికే రక్షాబంధన్ సందర్భంగా మార్కెట్లో వాడ వాడన వీధి వీధిన బోలెడన్ని రాఖీల సందడి మొదలైంది. మార్కెట్లో సరికొత్త డిజైన్ డిజైన్ల రాఖీలు సందడి చేస్తున్నాయి. ఇక అన్నదమ్ముల పేర్లతో కూడా రాఖీలు తయారు చేయించుకున్నవారు లేక పోలేదు. గత ఏడాది రాఖీ పండుగ కరోనా మహమ్మారి కారణంగా ఎవరు సరిగ్గా జరుపుకోలేని వారంతా ఈ ఏడాది రాఖీ పండుగను ఘనంగా వారి యొక్క కుటుంభంతో మరియు ఇరుగు పొరుగు వారితో కలిసి మెలిసి జరుపుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments